సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వివాహ సమయంలో వరకట్నం ఇచ్చారనే కారణంతో భార్య లేదా ఆమె తరపు కుటుంబ సభ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య స్వయంగా వరకట్నం ఇచ్చామని అంగీకరించినప్పటికీ, దానిని ఆమెపై కేసు నమోదు చేయడానికి ఆధారంగా తీసుకోకూడదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఒక వివాహ వివాదంలో, భార్య తన భర్త,అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ క్రమంలో, తాము ఇంత మొత్తంలో వరకట్నం ఇచ్చామని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. దీనిని ఆసరాగా చేసుకున్న భర్త తరపు వారు, వరకట్న నిషేధ చట్టం (Dowry Prohibition Act) ప్రకారం కట్నం ఇవ్వడం కూడా నేరమే కాబట్టి, భార్యపై కూడా ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయాలని కోర్టును ఆశ్రయించారు.
ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ జస్టిస్ బేల ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం ఈ క్రింది కీలక అంశాలను పేర్కొంది:
వరకట్న వేధింపులకు గురైన మహిళలు ఇచ్చే వాంగ్మూలాలు వారిపైనే తిరిగి అస్త్రాలుగా మారకూడదు.
వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 7(3) ప్రకారం, కట్నం ఇచ్చిన వ్యక్తిపై ఆ చట్టం కింద ప్రాసిక్యూషన్ చేయడానికి వీలులేదు.
వరకట్నం ఇచ్చామని భార్య నిజాయితీగా అంగీకరించినప్పుడు, దానిని ఆమెను వేధించడానికి లేదా క్రిమినల్ కేసుల్లో ఇరికించడానికి ఉపయోగించకూడదని .వరకట్న వేధింపుల బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఆమెపైనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని కోరడం చట్ట విరుద్ధం. అని తేల్చి చెప్పింది.
వరకట్న వేధింపుల కేసుల్లో భర్త తరపు వారు ఎదురుదాడికి దిగి, భార్యపై కేసులు పెట్టాలని చూసే ధోరణికి ఈ తీర్పుతో చెక్ పడినుంది . బాధిత మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని న్యాయవావాదులు భావిస్తున్నారు.









