భద్రాచలం జులై 27 : టుడే 9 ప్రతినిధి
భద్రాచలం ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రగిరి మార్ట్ ను హెచ్. డేవిడ్ రాజ్, ఏపీఓ (జనరల్), ఎస్. రాంబాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎస్. ఆదినారాయణ, ఆఫీస్ మేనేజర్ సంయుక్తంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్ట్‌లోని వస్తువుల నిల్వ (స్టాక్)ను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి ధృవీకరించారు. స్టాక్ నిర్వహణ, వస్తువుల నిల్వ, విక్రయ విధానం తదితర అంశాలను పరిశీలించి, నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
అంతేకాకుండా, స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Post Views: 13









