బిఎల్వోలు ఏన్యూమ రేషన్ ఫారాలు తప్పులు లేకుండా పూరించాలి…సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట.

భద్రాచలం జూన్ 27 : టుడే 9 ప్రతినిధి

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైనందున సంబంధిత బిఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా పూరించాలని భద్రాచలం నియోజకవర్గం ఈ ఆర్ ఓ. సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత బి ఎల్ ఓ. సూపర్వైజర్లకు సూచించారు.


శనివారం నాడు భద్రాచలం మండలంలోని రాజుపేట పారిశ్రామిక ప్రాంతం తాతగూడి కేంద్రం. లంబాడి కాలనీలలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ పారాలు బిఎల్వోలు ఓటర్ల దగ్గర వివరాలు సేకరించి నమోదు చేసేటప్పుడు సంబంధిత ఓటర్లతో ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఓటర్ నమోదు అనేది ఓటర్ల జాబితా సవరణ మాత్రమే అని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి, జాబితాలోని తప్పులను సరిదిద్దడానికి అలాగే చనిపోయిన వారి ఓట్లు తొలగించడానికి ఒకే వ్యక్తికి రెండు చోట్ల పోలింగ్ స్టేషన్లో ఓట్లు ఉంటే తొలగించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఎన్నికల కమిషన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. సంబంధిత బిఎల్వోలు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో తగిన సూచనలు సలహాలు ఇచ్చి తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫార్మ్స్ పూరించి వారి దగ్గర తీసుకున్న వెంటనే వారికి రసీదు అందించాలని బిఎల్వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు . సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share