భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 27
టుడే 9 ప్రతినిధి
గోదావరి వరద 70 అడుగులకు పైగా వరద వచ్చినా కూడా భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా కరకట్ట విస్తరణను ఇరిగేషన్. నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
శనివారం నాడు భద్రాచలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న కరకట్ట పనులను ప్రత్యక్షంగా ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986వ సంవత్సరంలో భద్రాచలంలో ఉన్న గోదావరి జలప్రళయాన్ని పరిగణలోకి తీసుకొని నూతనంగా కరకట్ట నిర్మాణం చేపట్టామని, ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట నిర్మాణం చేపట్టడం వలన భద్రాచలం పట్టణం . పరివాహక ప్రాంతాలను గోదావరి వరద తాకిడికి గురికాకుండా చాలా వరకు నియంత్రించగలిగామని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివర్యులు గోదావరి కరకట్ట విస్తరణకు 38 కోట్లు శాంక్షన్ చేయగా విస్తరణ పనులు చేపట్టామని అన్నారు.భద్రాచలం పట్టణానికి కరకట్ట శ్రీరామరక్షగా నిలిచిందని అన్నారు.

నూతనంగా నిర్మించే కరకట్ట పైనుంచి క్రాసింగ్ అయ్యే జాతీయ రహదారి బ్రిడ్జి డిజైన్ జాప్యం వల్ల కరకట్ట నిర్మాణం పనులు కొంత ఆలస్యమైందని అన్నారు.కరకట్ట నిర్మాణం పనులకు ఎటువంటి ఆటంకాలు సందేహాలు లేనందున నీటిపారుదల శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ ఇంజనీర్లతో కలిసి నిర్మాణ పనుల పురోగతి పనులను పరస్పర సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు.
.

గోదావరి వరదల సమయంలో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే విధంగా కరకట్ట నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, నీటిపారుదల శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ ఇంజనీర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









