*జాతీయ అవార్డు “వయోశ్రేష్ఠ సమ్మాన్”కు భద్రాచలం క్రీడాకారుడు డి.వి. శంకరరావు నామినేషన్.

పరిశీలనలో ఉన్నట్టు ​ప్రకటించిన ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్. ​గుండె శస్త్రచికిత్స అనంతరం పవర్ లిఫ్టింగ్‌లో రికార్డుల వేటపై సర్వత్రా ప్రశంసలు
_​హైదరాబాద్ సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కారం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూలై 26
టుడే 9 ప్రతినిధి

వార్ధక్యాన్ని. అనారోగ్యాన్ని సైతం ఎదిరించి జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్‌లో అద్భుత రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారు మూల గిరిజన ప్రాంతమైన భద్రాచలం గ్రామం లోని సిటీ స్టైల్ జిమ్ కు, చెందిన ప్రముఖ క్రీడాకారుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యస్ బి ఐ విశ్రాంత అధికారి దేశరాజు వెంకట శంకరరావు (74) భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక “వయోశ్రేష్ఠ సమ్మాన్” జాతీయ అవార్డుకు ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా నామినేట్ అవబోతున్నారు.

​హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (విశ్వేశ్వరయ్య భవన్) ప్రాంగణంలో నిన్న (25.06.2026) జరిగిన ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా పవర్ లిఫ్టింగ్‌లో ఆయన సాధించిన ఘన విజయాలకు గానూ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్ , ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ ఆయనను అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు.

​కోచ్ రామిరెడ్డి సేవలకు గుర్తింపు – అవార్డుకు సిఫార్సు:


ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్ మాట్లాడుతూ. గుండెకు బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా, భద్రాచలం ‘సిటీ స్టైల్ జిమ్’ లో కఠిన శిక్షణ పొంది దేశానికే స్ఫూర్తిగా నిలిచిన శంకరరావు ప్రతిభను కొనియాడారు. 74 ఏళ్ల వయసులో ఆయన సాధిస్తున్న రికార్డుల వెనుక, ఆయన మెంటార్. కోచ్ అయిన శ్రీ జి.వి. రామిరెడ్డి నిరంతర కృషి, అంకితభావం ఎంతో అభినందనీయమన్నారు.

శంకరరావు సీనియర్ సిటిజన్లకు, పెన్షనర్లకు రోల్ మోడల్‌గా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని, కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సాధికారతకు ఇచ్చే అత్యున్నత పురస్కారం “వయోశ్రేష్ఠ సమ్మాన్” అవార్డుకు తమ అసోసియేషన్ తరఫున అధికారికంగా నామినేట్ విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు.

​వార్ధక్యాన్ని శాపంగా కాకుండా, శారీరక దృఢత్వంతో సరికొత్త రికార్డులు సృష్టించవచ్చని నిరూపించిన శంకరరావును సత్కరించుకోవడం . జాతీయ అవార్డుకు ప్రతిపాదించడం తమ అసోసియేషన్‌కే గర్వకారణమని ప్రెసిడెంట్ శ్రీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

ఈ సన్మాన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది ఎస్బీఐ విశ్రాంత అధికారులు, ప్రతినిధులు పాల్గొని శంకరరావును అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share