.
భద్రాచలం జూలై 25 : టుడే 9 ప్రతినిధి
గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.

గురువారం నాడు స్వామివారి దర్శనానికి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు దేవస్థానం పర్యవేక్షకుడు సాయిబాబా. అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. బలపీఠం వద్ద ప్రత్యేక పూజలు జరిపి గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారిని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి పట్టు వస్త్రాలను అందించి స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం చిత్రకూట మండపంలో కుటుంబ సభ్యులతో కలిసి తన చిన్న కుమారునికి అర్చక స్వాములతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూతన పంచల అలంకరణ( ధారణ) కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణ్, రాంబాబు. అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 13









