ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని కన్నీటి గాథకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని కన్నీటి గాథను విని సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. ఆమె దయనీయ పరిస్థితిని గుర్తించి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మాజూరు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు

జాతీయ స్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీల్లో మొదటి స్థానం సాధించిన ఖమ్మం 30వ డివిజన్‌కు చెందిన లక్ష్మి కుమార్తె దేవిశ్రీ ప్రసన్నకు ఈ నెల 19న ఎల్‌బీ స్టేడియంలో రూ.50 వేల నగదు బహుమతితో పాటు మెమెంటోను ముఖ్యమంత్రి అందజేశారు.ఆ సందర్భంగా తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ, తనకు తండ్రి లేరని, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో తన తల్లి తనను చదివిస్తోందని, కనీసం సొంత ఇల్లు కూడా లేదని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థిని వినతిపత్రం అందజేసింది.

ఆమె కష్టాలను విని చలించిపోయిన సీఎం వెంటనే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు లక్ష్మికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు పత్రాన్ని అధికారులు, కాంగ్రెస్ నేతలు అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share