కాకినాడలో అదృశ్యమైన చిన్నారిని అటవీ మృగాలు లాక్కెళ్లి ఉంటాయని అనుమానంగా ఉంది మీడియాతో విచారణ పురోగతిని వివరించిన జిల్లా ఎస్పీ…
కాకినాడలో అదృశ్యమైన చిన్నారిని అటవీ మృగాలు లాక్కెళ్లి ఉంటాయని అనుమానంగా ఉంది అంటూ మీడియాతో జిల్లా ఎస్పీ విచారణ పురోగతిని వివరించారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎవరూ తీసుకెళ్లినట్లు లేదు కాబట్టి, అడవి జంతువులు లాక్కెళ్లాయని అనుమానిస్తున్నామన్నారు ఎస్పీ .కాగా ఇప్పటి వరకూ ఏ కోణంలోనూ స్పష్టమైన ఆధారాలు దొరకలేదన్నారు.పాప అదృశ్యమైన రోజు వర్షం పడింది, ఇలాంటి కొండ ప్రాంతంలో వర్షపు నీరు జారుతూ ఉంటుందిఅలా వరద నీటిలో కిందకి జారుతూ వెళ్ళిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వివరించారు ఎస్పీ ,ప్రస్తుతానికి థర్మల్ డ్రోన్ల సహాయంతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారుఎస్పీ బిందు మాధవ్.
జానుతో పాటు వెళ్లి తిరిగొచ్చి చనిపోయిన కుక్కకు పోస్ట్ మార్టం పూర్తి చేసిన విషయం తెలిసిందే .కుక్క శరీరంలో నుండి నమూనాలు సేకరించిన అధికారులు విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మరో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఇతర అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించి, కొందరు అనుమానితులను గుర్తించారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో పది రోజుల క్రితం అడవిలోకి వెళ్లి తప్పిపోయిన చిన్నారి జాను ఉదంతంలో పోలీస్,అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బొమ్మల్లో మాంసం ముద్దలు పెట్టి కంచెకు ఏర్పాటు చేశారు పోలీసులు. కాకినాడ జిల్లా చిన్నారి అదృశ్యం కేసులో అడవి జంతువుల కదలికలు తెలుసుకునేందుకు పోలీసుల ప్రయత్నంలో భాగంగా బొమ్మలను ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేశారు. ఒకవేళ అడవి జంతువులు మాంసం కోసం వచ్చి కంచెకు చిక్కటం జరిగితే … అడవి జంతువుల వల్ల పాపకు ప్రమాదం ఏమైనా జరిగి ఉండవచ్చుననే కోణంలో విచారణ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. ఏది ఏమైనా అదృశ్యమై పదకొండు రోజులు గడిచినా ఇంతవరకూ అంతుచిక్కని ప్రశ్నలా వేధిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియాలని,కుటుంబ సభ్యుల దగ్గరకు పాప క్షేమంగా చేరాలని అందరూ కోరుకుంటున్నారు.









