భద్రాచలంలోని 141 బెటాలియన్ లో మెగా హెల్త్ క్యాంప్.

భద్రాచలం జూన్ 15 : Today 9 ప్రతినిధి

100 డేస్ టీబీసీ క్యాంపెయిన్ 0.2 లో భాగంగా భద్రాచలం టిబి యూనిట్ ఏ ఏ యం కంబాలపాడు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ క్యాంపు లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, రెండు వారాల నుంచి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గటం, రాత్రి చెమటలు పట్టడం, దగ్గినప్పుడు తెమడ పడటం ఉన్నట్లయితే అవి క్షయ వ్యాధి లక్షణాలని, క్షయ వ్యాధి నిర్ధారణ కోసం తెమడ పరీక్ష, ఎక్స్రే పరీక్ష చేసిన తర్వాత నిర్ధారణ జరిగాక ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధిని నివారించవచ్చునని తెలియజేశారు.

ఏ సి యస్ యం కోఆర్డినేటర్ సోమయ్య మాట్లాడుతూ, క్షయ వ్యాధి పేషెంట్ మందులు వాడుతున్నంత కాలం వెయ్యి రూపాయలు నిక్షయ పోషణ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా పేషంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ హెల్త్ క్యాంపులో భాగంగా క్షయ వ్యాధి అనుమానితుల వద్ద నుండి తెమడ శాంపిల్స్ సేకరించారు. అనంతరం అత్యాధునికమైన హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే ద్వారా ఛాతి ఎక్స్రే పరీక్ష నిర్వహించారు . కార్యక్రమంలో బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల్ కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ పావని రెడ్డి, డీపీసీ , చో , హెయో , STS ,MLHP, ANM, టిబి అలర్ట్ ఇండియా ఎన్జీవో X-ray technician, సెక్యూర్ ఎన్జీవోస్ , TBHV,STLS ఆశాలు employees హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share