దొంగతనం కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవదిలోనే దొంగలను చేదించిన భద్రాచలం పోలీసులు.

భద్రాచలం జూన్ 10 : TODAY 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణం పోలీస్ స్టేషన్లో ఈ నెల 6వ తేదీన ఒక దొంగతనం కేసు నమోదు కాగా, భద్రాచలం డీస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ యస్ ఐ పి.శ్యాం ప్రసాద్ భద్రాచలం పోలీస్ స్టేషన్ సిబ్బందితో దొంగతనం కేసు విచారణలో బాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు. ఇతర సమాచారాన్ని సేకరించి మంగళ వారం: నాడు డీస్పీ భద్రాచలం ఆదేశాల మేరకు రాత్రి సమయంలో భద్రాచలం పట్టణ యస్ ఐ పి.శ్యాం ప్రసాద్ భద్రాచలం పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా భద్రాచలం ఊరు చివరన వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు వాహనాల తనిఖి నిర్వహించే సమయంలో నలుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిళ్ళను స్వాదినపర్చుకున్నారు. నిందితులను నల్గొండ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. వీరు గతంలో హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో పలు మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినారు. వీరు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను ఓడిస్సాకు తీసుకువెళ్లి అక్కడ గంజాయి సరపరా చేసే గంజాయి వ్యాపారులకు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు ఇచ్చి వారి వద్ద నుండి గంజాయి తీసుకొని, గంజాయి రవాణా చేస్తుండేవారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సదరు దొంగతనం చేసిన నాలుగు మోటార్ సైకిళ్ళును ఓడిస్సా తీసుకొని వెళుతుండగా వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ రోజు నలుగురు దొంగలను భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్యాం ప్రసాద్ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది . ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన భద్రాచలం టౌన్ అధికారులను. పోలీస్ సిబ్బందిని భద్రాచలం డీస్పీ అభినందించారు. ప్రజలు తమ వాహనాలను భద్రమైన ప్రదేశాలలో పార్క్ చేయాలని, తాళాలు తప్పనిసరిగా వేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భద్రాచలం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share