అవినీతి నిరోధక శాఖ చరిత్రలో చిక్కిన అతి పెద్ద తిమింగలం ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌…

అవినీతి నిరోధక శాఖ చరిత్రలో చిక్కిన అతి పెద్ద తిమింగలం ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌ అవినీతి దందా చూసిన ఏసీబీ అధికారులు ఆశ్చర్య పోయారు. మంగళ వారం ఏసీబీ కి చిక్కిన మోహన్ నాయక్ కు మోహన్‌నాయక్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన నేపద్యంలో.. చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌ ఇంట్లో రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మోహన్‌నాయక్‌ ఇంట్లో రూ.60 లక్షల నగదుతో పాటు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు.హైదరాబాద్‌లో పలు ప్లాట్లు, నిజామాబాద్‌లో వ్యవసాయ భూమి, అత్యంత ఖరీదైన విల్లాతో, అపార్ట్‌మెంటలు, ఖాళీ స్థలాలు, ఫామ్‌ హౌజ్‌లు, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ విచారణ లో వెల్లడైంది.

మోహన్ నాయక్ కు గచ్చిబౌలిలో 4, కొంపల్లిలో 3 ప్లాట్లు.. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.7.34 కోట్లు, మియాపూర్‌లో రూ.2.5 కోట్ల రిజిస్ట్రేషన్ విలువైన ట్రిపులెక్స్ విల్లా,కూకట్‌పల్లిలో రూ.62.14 లక్షల రిజిస్ట్రేషన్ విలువ గల ఇల్లు,నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న విల్లా, నిజామాబాద్ జిల్లా ముల్లగింలో రూ.82.89 లక్షల విలువ చేసే 19.38 ఎకరాల వ్యవసాయ భూములు,రిజిస్ట్రేషన్ విలువల కంటే బహిరంగ మార్కెట్‌లో వీటి విలువలు 10 రెట్లు అధికంగా ఉండొచ్చు.ఇవే కాకుండా దాదాపు 60 విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లు దొరకడంతో ఏసీబీ అధికారులు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share