భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి… ఫైనాన్సియర్ల వేధింపులే కారణమంటూ వాట్సాప్ స్టేటస్…
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల సల్కిలాపురం గ్రామంలో భార్య(36), ఇద్దరు పిల్లల(పది, ఎనిమిదవ తరగతి)ను చంపి, తాను నరసింహ(40)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన నెలకొంది.పిల్లలను సంపులో పడేసి, భార్యకు ఉరివేసిన నరసింహ అనంతరం తాను చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.
వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల సల్కిలాపురం గ్రామ శివారులోని 52 ఎకరాల మామిడితోటను గత ఆరేళ్లుగా లీజుకు తీసుకుంటున్న మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నర్సింహులు(40) మామిడి తోట సాగు కోసం ఆరేళ్లుగా చేసిన రూ.60 లక్షల అప్పు, వడ్డీతో సహా రూ.1.20 కోట్లకు చేరగా, ఊర్లో ఉన్న ఇంటిపై రుణం తీసుకుని కొంత అప్పు తీర్చాడు.
కాగా మిగతా అప్పు తీర్చాలని ఫైనాన్షియర్లు వేధిస్తున్నారని, ఇంటికి నోటీస్ అంటించి బంగారం తీసుకెళ్లారని, తనను వేధించినట్లు ఇంకెవరినీ వేధించొద్దని బాధితుడు నరసింహ వాట్సాప్ స్టేటస్ పెట్టి ,వరుసకు అల్లుడైన వ్యక్తికి ఫోన్ చేసి భార్య ఎల్లమ్మ(33)ను ఉరి వేసి చంపేశానని, పిల్లలు(సాయినిహల్(15), సాహితీశ్రీ(12))లను సంపులో పడేశానని, తాను కూడా చనిపోతున్నానని నర్సింహులు తెలియజేశారు. అయితే ఉదయం మామిడి తోటకు వచ్చి చూడగా, విగత జీవులుగా పడి ఉన్న కుటుంబాన్ని చూసిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు .నర్సింహులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









