కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేవరకు విశ్రమించేది లేదు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో : దుమ్ము గూడెం :మే 1: టుడే 9 ప్రతినిధి

లక్ష్మి నగారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం.అజయ్ కుమార్ మాట్లాడుతూ గిరిజనులకు లక్షన్నర ఎకరాలు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల ఎంతో శ్రమించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ప్రాజెక్ట్ కట్టినట్లుగా మోటార్లు ఆన్ చేసి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కమీషన్లు దండుకొని ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవరిస్తున్నారన్నారు.

రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దని,ఎన్నో కష్టాలు భరించి పంటలు పండిస్తే కొనే దిక్కు లేకుండావాళ్లకి ఇంట్రెస్ట్ లేకపోతే పోయిందని. మనిషిని మనిషి ముట్టుకునే పరిస్థితి లేని కరోనా సమయంలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దిని గుర్తు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా తెరవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడి నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేక కేసీఆర్ మీద నిందలు వేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుందని దుయ్యబట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బందుకు రాం..రాం..దళిత బందు జై బీమ్ అని ఆనాడే కేసీఆర్ చెప్పారన్నారు.నాట్లకు నాట్లకి మధ్యలో వచ్చే రైతు భరోసా ఇప్పుడు ఓట్లకు ఓట్లకి మధ్యలో వేస్తున్నారని దుయ్యబట్టారు.తెలంగాణాకు మళ్ళీ మంచి రోజులు రావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు అందరు కష్టపడి అత్యధిక స్థానాలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు