నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా…!

నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా…అంటూ ఒక దివ్యాంగుడి వేడుకోలు..

గుంటూరుకు చెందిన దివ్యాంగుడు తన కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకూ పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా ఆర్.ఆగ్రహారంలో తన కూతురు(15) కనిపించడం లేదని గత ఏడాది ఫిబ్రవరి నెలలో  ఏసోబు అనే దివ్యాంగుడు ఫిర్యాదు చేశాడు.

4 నెలల తరువాత ఒక కొత్త నంబర్ నుండి తన కూతురు ఫోన్ చేసి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నానని చెప్పిందని, అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరో ఫోన్ కట్ చేశారని, ఈ విషయం చెప్పినా కూడా పోలీసులు కనీసం స్పందించలేదని తండ్రి ఏసోబు ఆవేదన చెందుతున్నాడు.మరికొన్ని రోజుల తర్వాత అదే నెంబర్ నుండి ఫోన్ చేసి, మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారని, ఆ ఫోన్ నంబర్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు. కాగా ఇప్పటికైనా తన కూతురు బతికి ఉందో, చనిపోయిందో తేల్చాలని పోలీసుల ముందు బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు