బిల్లుల కోసం ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన మన ఊరు మన బడి కాంట్రాక్టర్…
బిల్లులు చెల్లించలేదని మన ఊరు మన బడి పథకం కింద నిర్మించిన పాఠశాలకు కాంట్రాక్టర్ తాళం వేసిన ఘటన యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం, సంగెం గ్రామంలో వెలుగు చూసింది.
ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో.. పాఠశాలకు తాళం వేశారు కాంట్రాక్టర్ రాంరెడ్డి.మన ఊరు మన బడి పథకం కింద.. పాఠశాలలో అదనపు భవనాలను నిర్మించిన రాంరెడ్డి. నెలలు గడుస్తున్నప్పటికీ బిల్లులు రాకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళం వేశాడు.విద్యార్థులు పాఠశాలకు చేరుకోగానే గేటుకు తాళం దర్శనమివ్వటంతో నివ్వెరపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని వివరాలపై ఆరా తీశారు. తరువాత కాంట్రాక్టర్ కు సర్ది చెప్పి గేటుకు వేసిన తాళాన్ని తీయించారు.
Post Views: 38








