అతిగా మద్యం సేవించటంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి

అతిగా మద్యం సేవించటం వల్ల ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి చెందిన సంఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి బండవడ్డిపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మణికుమార్(35), పుష్పరాజ్(22) చెన్నై, బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు  సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన క్రమంలో, స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ, మద్యం ఎక్కువ అవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.ఈ విషయం గమనించిన వారి స్నేహితులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలోనే మృతి చెందారు.

అయితే ఇద్దరు యువకుల్లో ఒకరు ఆరు బీర్లు, మరో యువకుడు ఐదు బీర్లు సేవించారని, కల్తీ మద్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్నేహితులు ఆరోపిస్తున్నారు.కాగా మణికుమార్‌కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉండగా, పుష్పరాజ్‌కు ఇంతవరకు వివాహం జరగలేదని స్థానికులు తెలియజేశారు.పండుగ సమయంలో యువకులు మృతి చెందడంతో,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.యువకుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు