ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు.. కేసులో ఇంకా ఏం మిగిలింది.?!!

ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు.. కేసులో ఇంకా ఏం మిగిలింది.?!!..

ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు.. కేసులో ఇంకా ఏం మిగిలింది.?!! అంటూ ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి అంటూ సూచిస్తూ, ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం.. మీ పర్పస్ పూర్తయిందా లేదా.?? అంటూ ప్రశ్నించింది.కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని , ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం.  ప్రభాకర్ రావు ను మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా.? అని అసహనం వ్యక్తం చేసింది.

ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు కదా.. ఆయన దర్యాప్తుకు సహకరిస్తారు అని కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా తదుపరి విచారణ చేసే వరకు మధ్యంతర రక్షణ పొడిగింపు చేస్తూ.. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా వేసింది.ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు