పదవుల కోసం ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్ల పేరుతో బీఆర్ ఎస్ నేతలు ఆస్తులు పోగేసుకున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRSకు భవిష్యత్తు లేదు: సీఎం రేవంత్..
బీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను దోచుకున్న ఆ పార్టీ నేతలను సమాజం సామాజికంగా బహిష్కరించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి రాజకీయ పదవులు దక్కవని స్పష్టం చేశారు. BRSకు గతం మాత్రమే మిగిలిందని, భవిష్యత్తులో ఎలాంటి స్థానం లేదని హెచ్చరించారు.ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా… మూసీ లేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తానన్నారు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో త్యాగాలు చేశామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు, పదవుల కోసం ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్ల పేరుతో ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపించారు. నిజమైన త్యాగధనుడైన కొండా లక్ష్మణ్ బాపూజీని విస్మరించిన వారు త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు….
అగ్గిపెట్టె రావు అంటూ సీఎం రేవంత్ విమర్శలు..
మరోవైపు బీఆర్ ఎస్ అగ్రనేత హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్య మంత్రి.తెలంగాణ కోసం నిటారుగా నిలబడి ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఎక్కడ, పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేదనే సాకుతో పక్కకు తప్పుకున్న నువ్వెక్కడ హరీష్ రావు అంటూ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మరో వైపు సూర్యాపేట MLA జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు..సూర్యాపేట BRS MLA జగదీష్ రెడ్డిని ఉద్దేశించి నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘”తులసివనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో మిగిలిన ఒక్కరిని కూడా వదిలేది లేదని కొంతమంది యువకులకు నాకు చెప్పినట్లు’’ తెలిపారు. అలాగే, యువత వెంకన్నను నమ్ముకుని ఉన్నారని, వారు మళ్ళీ సూర్యాపేటలో తమ పట్టునిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారని తెలిపారు.
మంత్రి వెంకట రెడ్డి మాట్లాడుతూ గతంలో TRS ఇవాళ BRS.. రేపు HRS గా పేరు మారుతుందేమో అని HRS అంటే హరీశ్‌రావు రాష్ట్ర సమితి అని, పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా అంటూ ఎద్దేవా చేశారు.SLBC పనులను 2028 ఆగస్ట్ లోపు పూర్తి చేసి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.









