భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 26
టుడే 9 ప్రతినిధి
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ ప్రారంభమైనందున బి ఎల్ వో లు, సూపర్వైజర్లు అందించిన ఎన్యుమరేషన్ ఫారంలలో ఓటర్లు తమ పూర్తి వివరాలు నమోదు చేసి బి ఎల్ ఓ సూపర్వైజర్లకు అందించాలని 110-( ఎస్ టి) పినపాక నియోజకవర్గం ఈ ఆర్ ఓ. ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఓటర్లకు సూచించారు.
శుక్రవారం నాడు బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు 233,వీరవెండి191, మోతే 189 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు సంబంధిత ఓటర్లకు అందించి ఓటర్లకు పలు సూచనలు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ అంటే కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమే అని,అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి. జాబితాలోని తప్పులను సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం అని, ఓటర్లు బిఎల్వోలు . సూపర్వైజర్లు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకొని కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరి పూర్తిస్థాయి వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయించి తిరిగి బిఎల్ఓలకి అందించినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అన్నారు.సంబంధిత ఓటర్లు సర్ ఓటర్ జాబిత ప్రక్రియలో ఓటు నమోదు చేయించుకోవడానికి ఎటువంటి అనుమానాలు, భయాందోళనలు పెట్టుకోవద్దని, ఈ సర్వే ద్వారా మరణించిన వారి పేర్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు మరియు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారని, ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ప్రతి ఓటరు ఇంటికి వచ్చి వివరాలను వెరిఫై చేస్తారని, ఇది కేవలం ఓట్ల సవరణ ప్రక్రియ మాత్రమేనని, అర్హులైన వారి ఓట్లను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించబోరని, అందుకు బి ఎల్ వో లకు సంబంధిత ఇంటి యజమానులు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారంలో మీ ఇంటిలోని సభ్యుల అర్హులైన వారి అందరి వివరాలను అందించి సహకరించాలని అన్నారు.అనంతరం బిఎల్ఓ లకి, సూపర్వైజర్లకి సూచనలు ఇస్తూ ప్రతి ఇంటింటికి తిరిగి తప్పనిసరిగా ఇంటి సభ్యుల పూర్తి వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు డిప్యూటీ తాసిల్దార్ సమ్మయ్య, బిఎల్వోలు పద్మ, దీపిక, శ్రీలక్ష్మి, మేరీ, చందు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10









