భద్రాచలం : జూన్ 26: TODAY 9 ప్రతినిధి
ప్రజా సమస్యలపై పోరాటమే బీఆర్ఎస్ లక్ష్యం అని అన్నారు భద్రాచలం నియోజక వర్గ ఇన్ చార్జ్ ….రావులపల్లి రాంప్రసాద్….భద్రాచలం పట్టణంలోని తెలంగాణ హరిత హోటల్‌లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రావులపల్లి రాంప్రసాద్, పార్టీ నాయకుడు మానే రామకృష్ణ పాల్గొని పలు రాజకీయ, ప్రజా సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్ ) కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి బూత్‌కు ఒక్కో పార్టీ కార్యకర్తను నియమించామని తెలిపారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఓటరు జాబితా పరిశీలనతో పాటు స్థానిక ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల అనంతరం ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామపంచాయతీలకు కార్మికుల వేతనాలు, వాహనాల ఇంధన ఖర్చులకు అవసరమైన నిధులు విడుదల కాలేదని ఆరోపించారు.
భద్రాచలం ప్రాంతంలో ఇసుక ర్యాంపుల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని, రైజింగ్ కాంట్రాక్టర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.
భద్రాద్రి జిల్లాకు చెందిన మంత్రులు స్థానిక సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారమే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హయాంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేయడానికి పార్టీ కృషి చేస్తుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలోరావులపల్లి పృద్వి, ప్రభోద్ కుమార్, ఆకోజు సునీల్ కుమార్,పూర్ణచంద్ర రావు, ప్రదీప్,శివ,బాబీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









