భద్రాచలం జూన్ 26 : TODAY 9 ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు చిన్నమైల్అంజి రెడ్డి. శుక్రవారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన సారపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, పట్టభద్రుల సంక్షేమం, విద్య, ఉపాధి మరియు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, బోడ సత్యనారాయణ, ట్రిపుల్ ఎక్స్ చక్రవర్తి, పాండు రంగాచారి.తదితరులు పాల్గొన్నారు.









