భద్రాచలం జూలై 25 : టుడే 9 ప్రతినిధి
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను సంబంధిత బిఎల్వోలు. సూపర్వైజర్లు అర్హులైన ఓటర్లను గుర్తించి తప్పనిసరిగా నమోదు చేయాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
గురువారం నాడు ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 167 పరిధిలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి ఎన్యుమరేషన్ ఫారం అందించడానికి వచ్చిన తహసిల్దార్. బిఎల్ఓ ద్వారా ఎన్యుమరేషన్ ఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బి ఎల్ ఓ. సూపర్వైజర్లకు పలు సూచనలు ఇస్తూ ఎన్యుమరేషన్ ఫారంలో ఓటర్ల యొక్క వివరాలు పొందుపరిచేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్లను పూర్తిస్థాయిలో వివరాలు అడిగిన తర్వాతనే ఎన్యుమరేషన్ ఫారంలో పొందుపరచాలని అన్నారు.
అనంతరం భద్రాచలం తహసిల్దార్. బిఎల్వోలు సూపర్వైజర్లు ఎస్ ఆర్ ఎన్ కాలనీలోని 172 పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పోదెం వీరయ్య కుటుంబ సభ్యులకు ఎన్యుమరేషన్ పారములు అందించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం తహసిల్దార్ కోటా రవికుమార్, బిఎల్వోలు రాజేశ్వరి, మంగమ్మ, సూపర్వైజర్లు వరలక్ష్మి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 12









