ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి : ఎస్‌ఎఫ్‌ఐ.

*ఫీజులు అధికంగా వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

*ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఎస్ఎఫ్ఐ.

ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కొప్పుల రవీందర్.

భద్రాచలం జులై 23 :TODAY 9 ప్రతినిధి

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యా రంగ సమస్యలపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రమాదేవి కి వినతిపత్రం అందజేశారు .
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొప్పుల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని అన్నారు. పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, టైలు, బెల్టులు, షూస్ తదితర వస్తువులను తమ సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడం సరికాదని పేర్కొన్నారు. ఇటువంటి దోపిడీ విధానాలను ప్రభుత్వం అరికట్టి, విద్యార్థులు ఎక్కడైనా కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ కల్పించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా అనేక మౌలిక సమస్యలు కొనసాగుతున్నాయని, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్, శుభ్రత వంటి కనీస సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారానే పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ విద్యను పరిరక్షించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు అందజేసిన వినతిపత్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చందువర్ధన్ సాయికుమార్ కిషోర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share