భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కరువు.

•కిడ్నీ సంబంధిత డాక్టర్ లేక పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు .

•వేరే ఊర్లకు రిఫర్ రాస్తూ సరిపెడుతున్న డాక్టర్లు.

•సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకుడు సాయన్న.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 21
టుడే 9 ప్రతినిది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద కమలాపురం గ్రామానికి చెందిన వరుస భద్రమ్మ వైఫ్ ఆఫ్ వీరయ్య అనారోగ్యంతో బాధ పడుతున్నందున కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 20వ తేదీన నాలుగు గంటల సమయంలో వైద్యం కొరకు తీసుకురావడం జరిగిందని . సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద డివిజన్ నాయకుడు సాయన్న కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి వచ్చి డాక్టర్లను సంప్రదించగా రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు డయాలసిస్ చేయడానికి క్రిస్టల్ వేయడానికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధిత డాక్టర్ లేడని వెంటనే కొత్తగూడెం సాయన్న డాక్టర్ తో మాట్లాడారు భద్రమ్మకు యూ రిన్ బంద్ అయింది ఆయాసం వస్తుంది కొంతవరకు కోలుకునే దాకా ఇక్కడే ఉంచండి అని ప్రాధేయపడినా, డాక్టర్లు ఇక్కడ ఆమెకి సంబంధించిన వైద్యం లేదు కొత్తగూడెం తీసుకెళ్లమని సూచించారున్నారు.కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ లో చేరుకున్నాక అక్కడి డాక్టర్లు ఈ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత డాక్టర్ లేరని డయాలసిస్ పిస్టల్ వేయటానికి పరికరాలు, సంబంధిత డాక్టర్లు కూడా లేరని చెప్పారన్నారు. ఖమ్మం తీసుకెళ్లమని సలహాలు ఇచ్చారని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా తీరా అక్కడ డాక్టర్లు మా దగ్గర కిడ్నీకి సంబంధించిన డాక్టర్ లేరని బదులిచ్చారని వాపోయారు. అక్కడి నుంచి వరంగల్ లేదా హైదరాబాదుకు తీసుకెళ్ళమని ఖమ్మం డాక్టర్లు చెప్పగా ఒక్కసారిగా పేషెంట్ కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు భద్రమ్మ యూరియా నడవక కడుపు ఉబ్బి ఉంది వెంటనే దిక్కుతోచని పరిస్థితుల్లో వెనుదిరిగి భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించాల్సి వచ్చిందని ఆందోళనను వెలిబుచ్చారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తంతు అని విమర్శించారు. దీనిపై జిల్లాలో ఉన్నతాధికారులైన భద్రాచలం ఐటిడిఏ పిఓ. కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలన్నారు. .నాలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు సంబందించి ఏజెన్సీ ప్రజలకి వైద్యం అందించలేరా? అంటూ ప్రశ్నించారు. గతంలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపర్నెంట్ మణుగూరు కి ట్రాన్స్ఫర్ కావటం వల్ల భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే ప్రజలకు తిప్పలు తప్పడం లేదన్నారు.ఈ పది పదిహేను రోజుల్లోవందల మంది పేషెంట్లు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ చూసినా ఖాళీ బెడ్లతో దర్శనమిస్తున్నాయన్నారు. ఉన్నతాదికారులు ఇకనైనా స్పందించి పర్మినెంట్ జనరల్ సర్జన్ పోస్టును భర్తీ చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీలు చేసి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇక్కడ జీతం తీసుకుంటూ బయటి ప్రాంతాలకు పంపించిన డాక్టర్ను వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తీసుకురావాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని పేదలని గుర్తుపెట్టుకుని సకల సౌకర్యాలు కల్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు డివిజన్ నాయకులు సాయన్న..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share