బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హోటల్‌లో ఆదివారం ఉదయం యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు ఈశ్వరరావు. ఆధ్వర్యంలో యోగా ఆసనాలు, ప్రాణాయామ సాధనలు నిర్వహించగా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు యోగా సాధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, ముత్యాల శ్రీనివాస్, నిడదవోలు నాగబాబు, ములిశెట్టి రాంమోహన్ రావు, బోడ సత్యనారాయణ, ముత్యాల చంద్రశేఖర్, చెల్లుబోయిన వెంకన్న, ములిశెట్టి నిఖిల్, హరీష్, పానీపూరి శ్రీను, పాండురంగాచారి, షేర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share