నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత.. గిరిజనులను అరెస్ట్ చేసిన పోలీసులు ..

నిర్మల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు గిరిజనులను అరెస్ట్ చేసిన ఘటనపై స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.కడెం మండలం మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తూ హద్దు రాళ్లను పాతుతున్న రెవిన్యూ అధికారులను అడ్డుకొని తమ గ్రామ గిరిజనులకు భూములు కేటాయించిన తర్వాతే హద్దులు చూపించాలని నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు డిమాండ్ చేశారు …

అడ్డుకున్న గిరిజనులను అటవీశాఖ అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకొన్న అటవీ శాఖ అధికారులు జన్నారం మండలం ఇంధన్ పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. 150 మంది పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది భారీ బందోబస్తు మధ్య మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు కేటాయించిన భూములను చదును చేస్తూ రెవెన్యూ హద్దు రాళ్లను పాతుతూ వారి పట్టా నెంబర్లను అధికారులు వేస్తున్న క్రమంలో ఈ ఆందోళన చోటు చేసుకుంది. అయితే ఈ భూములలో కొంత నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు గతంలో పొరుకులు కొట్టుకొని తాము సాగు చేశామని ఆ భూములను తమకు కేటాయించిన తర్వాతే మైసంపేట్ గ్రామస్తులకు భూములు పంపిణీ చేయాలని నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు డిమాండ్ చేశారు. మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు కేటాయించిన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share