హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోని కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పాటు… బాధితుల నుండి ఏసీబీకి ఫిర్యాదుల వెల్లువగా వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తుండగా,తవ్వే కొద్దీ బంగారం.. ఇంటి నిండా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.ఈ అక్రమాస్తుల వ్యవహారం ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీగా నగదు కట్టలు, బంగారం, వెండి, కీలక భూ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే నరహరి బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ విస్తృత సోదాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ రికార్డులు, ల్యాండ్ ప్లాట్ల డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
అక్రమాస్తుల నేపథ్యంలో హైదరాబాద్ ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసాలతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ₹32 లక్షల నగదు, భారీ మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు డిపాజిట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









