భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం మే 5
టుడే 9 ప్రతినిధి
గిరిజన విద్యార్థిని విద్యార్థులు సమ్మర్ క్యాంపులో ఎంచుకున్న కళలను శిక్షకులు అందించిన సలహాలు సూచనలను పాటించి నేర్చుకున్న కళలను మననం చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తే తప్పనిసరిగా మీరు నేర్చుకున్న కళలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని ఐ టీ డి ఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు.
మంగళవారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల పాఠశాల వికాసం పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంపు వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులు నేర్చుకుంటున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, పాటలు కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థుల మేధాశక్తి ప్రతిభను వెలికితీయడానికి సమ్మర్ శిక్షణా క్యాంపులలో నిష్ణాతులైన శిక్షకులచే వివిధ కోర్సులలో శిక్షణ అందిస్తున్నందున విద్యార్థులు తప్పనిసరిగా శ్రద్ధతో నేర్చుకొవాలని ఆయన విద్యార్థులకు సూచించారు..

అనంతరం కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ రెజంతో పాటు వర్డ్స్ . అభ్యాసాలను కూడా అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్ గా విద్యార్థుల చేత చేయించాలని అన్నారు. ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్ డాన్స్ సంబంధించిన మెలకువలు పిల్లలు క్రమశిక్షణతో నేర్చుకోవడంతో వారి యొక్క మెరుగుదలను పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, క్యాంప్ ఇంచార్జ్ నాగరాజు, పిడి వసంత్, మహాలక్ష్మి పిఈటి, ఆర్ పి లు నటరాజ్, విజయలక్ష్మి, నాగలక్ష్మి, సుజాత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









