కార్మిక చట్టాల పునరుద్ధరణ కోసమే మే డే స్ఫూర్తితో పోరాటాలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం: మే 1
టుడే 9 ప్రతినిధి

కేంద్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టాక కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను మోదీ కాలరాశారని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ ఆరోపించారు. మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాల పునర్దన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏ జె రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం 140 వ మే డే ఉత్సవాలను పట్టణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక చందర్రావు భవనంలో సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు అధ్యక్షతన జరిగిన కార్మిక సదస్సులో ఏజే రమేష్ పాల్గొని మాట్లాడారు. మేడే 140 సంవత్సరాల చరిత్రలో ఇంత నిర్బంధం ఎప్పుడు ఎవరు చూసి ఉండరని అన్నారు. చట్టాల స్థానంలో కోడ్లను తీసుకువచ్చి కార్మికులు స్వేచ్ఛగా కార్మిక దినోత్సవం కూడా చేసుకోకుండా మోడీ నిరంకుశంగా అడ్డుపడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పయనిస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి కార్మికులతో 12 గంటల ఎట్టి చాకిరి చేపిస్తున్నారని అన్నారు. చికాగో నగరంలో ఎనిమిది గంటల పని కోసం కార్మికులు తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నారని వారి స్ఫూర్తితోనే మేడే ఆనాడు ప్రారంభమైందని గుర్తు చేశారు. మరోసారి మే డే స్ఫూర్తితో నిరంకుశ మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించకుండా మతం మత్తు జల్లి కార్మికులను మతం పేరుతో విభజించి కార్మికుల హక్కులను మోది కాజేస్తున్నారని నర్సారెడ్డి ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తుల కోసమే ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని నీ తీసుకువచ్చారని ఆరోపించారు. కార్మిక సమస్యలపై ప్రశ్నించేందుకు యూనియన్ లేకుండా చేసి శ్రమ దోపిడీకి మోడీ పాల్పడుతున్నారని అన్నారు. మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వత్తాసుపలకటం దుర్మార్గమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మోడీ తీసుకు వచ్చిన కోడ్లను అత్యంత వేగంగా అమలు చేస్తున్నారని అన్నారు. హక్కులను కోల్పోతే కార్మిక తిరుగుబాటు తప్పదని ఆ తిరుగుబాటులో మోడీతో పాటు ఆయనకు భజన పలుకుతున్న అన్ని బూర్జవ పార్టీలు కార్మిక ఆగ్రహానికి గురి అవ్వటం ఖాయమని నర్సారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గడ్డం స్వామి కొలగాని రమేష్ నకిరేకంటి నాగరాజు పారెల్లి సంతోష్ కుమార్ డి రామకృష్ణ లక్ష్మణ్ చంద్ర లీల శివకుమారి తదితరులు పాల్గొన్నారు. మే డే సందర్భంగా పట్టణంలోని అన్ని కార్మిక కూడళ్ల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణలను నిర్వహించారు ఆటో కార్మికులు పళ్ళ వర్తక సంఘం నాయకులు షాప్ ఎంప్లాయిస్ చిన్నుపాటి లారీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఇండస్ట్రియల్ కార్మికులు ముఠా సంఘాల కార్యకర్తలు మేడే ర్యాలీలో భారీగా పాల్గొన్నారు.

సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండే రాజుపేట లో జెండా ఆవిష్కరణ జరగగా అనంతరం ఎంపీ కాలనీ అశోక్ నగర్ కాలనీ కొత్త కాలనీ అయ్యప్ప కాలనీ భూపతి రావు కాలనీ ముదిరాజ్ వీధి రామాలయం సెంటర్ సుభాష్ నగర్ తదితర ప్రాంతాలలో సిపిఐ ఎం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ అన్ని కార్మిక వాడలలో మేడే ఉత్సవాలను సిపిఎం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలలో ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని కార్మికుల శ్రమతోనే దేశ పునాదులు నిర్మించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి కుంజా శ్రీను ఉస్తెల జ్యోతి జీవనజ్యోతి ధనకొండ రాఘవయ్య చుక్క మాధవరావు ఎస్ అజయ్ కుమార్ చాట్ల శ్రీనివాసరావు భూపేంద్ర అంబోజీరత్నం కనక శ్రీ శాఖ కార్యదర్శిలు గోవర్ధన ఝాన్సీ ఎర్రంశెట్టి పూర్ణిమ వేణు ధనమ్మ సీత సున్నం ప్రవీణ్ డివైఎఫ్ఐ నాయకులు సతీష్ బాబు ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు