చికాగో కార్మిక అమరుల స్ఫూర్తితో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం : మే 1 : టుడే 9 ప్రతినిధి

సీపీఐ యం-యల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 140వ “మేడే” కార్మిక దినోత్సవాన్ని భద్రాచలం ఐటీడీఏ రూట్లో కొమరం భీమ్ విగ్రహం వద్ద అరుణపతాకం ఎగురవేసి చికాగో కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించి కొమరం భీం విగ్రహానికి పూల మాలలతో నివాళులర్పించారు . ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పని గంటల తగ్గింపు కోసం, శ్రమకు తగ్గ వేతనం కోసం చికాగో కార్మికులు పోరాడి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి రక్తంలో ముంచి ఎత్తినదే “ఎర్రజెండా” అని అన్నారు. ఎర్రజెండా నేత్రుత్వంలో ప్రపంచంలో, దేశంలో అనేక కార్మిక, రైతు కూలీ పోరాటాలు జరిగాయని అన్నారు.

దిక్కు మొక్కు లేని జనానికి ఎర్రజెండా బాసటగా నిలిచిందని అన్నారు. ఎర్రజెండా ఆవిర్బవించిన రోజులు మేడే అన్నారు. లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు పంచిందని కొనియాడారు. మేడే అంటేనే “ఎర్రజెండా” అని కొనియాడారు. నేడు కార్మికులను, రైతు కూలీలను వంచిస్తున్న పాలక పార్టీలకు మేడే స్ఫూర్తితో గుణపాఠం చెప్పాలని వారు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకురాలు కప్పల సూర్యకాంతం కోట నాగమణి పాయం రాజమ్మ సోడి పల్లవి వడ్డారి రమణ కటారి శ్యామల ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు