భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. ఏప్రిల్ 29 : టుడే 9 ప్రతినిధి
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థుల యొక్క పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో బాలురు 959 మంది, బాలికలు 1066 మంది, టోటల్ 2025 మంది పరీక్షలు రాయగా,857 మంది బాలురు, 992 మంది బాలికలు, టోటల్ 1849 మంది పాసయ్యారని, ఫెయిల్ అయిన వారిలో బాలురు 102 మంది, బాలికలు 74 మంది, టోటల్176 మంది ఫెయిలయ్యారని, బాలురు89.3639 ,పర్సంటేజ్ బాలికలు 93.0582 పర్సంటేజ్ వచ్చిందని, ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు 75 మంది బాలురు,96 మంది బాలికలు టోటల్ 171 మంది పరీక్షలు రాయగా, పాసైన వారిలో 69 మంది బాలురు,76 మంది బాలికలు మొత్తం 145 పాస్ అయ్యారని, ఫెయిల్ అయిన వారిలో బాలురు 6 మంది, బాలికలు 20 మంది టోటల్ 26 మంది 92.00 బాలురకు పర్సంటేజ్ వచ్చిందని, బాలికలకు 79.1667 పర్సంటేజ్ వచ్చిందని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలలో 19 మంది బాలురు 11 బాలికలు టోటల్ 30 మంది పాసయినారని 96.97% రిజల్ట్ వచ్చిందని అన్నారు. ఓరాలుగా 2226 మంది పరీక్షలు రాయగా 944 మంది బాలురు, 10 79 మంది బాలికలు, టోటల్ 2023 మంది పాసయ్యారని, ఫెయిల్ అయిన వారిలో 109 మంది బాలురు ,94 మంది బాలికలు ,మొత్తం 203 మంది ఫెయిలయ్యారని ,ఓరాలుగా బాలురు 89.649%, బాలికలు 91.986% టోటల్ పర్సంటేజ్ 90.88 రావడం జరిగిందని ఆయన అన్నారు. 22 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,05 వసతి గృహాలలో 100% రిజల్ట్ రావడం జరిగిందని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లాలోని10 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, 08 వసతి గృహాలు,02 బెస్ట్ అవైలబుల్ స్కూల్ లలో చదువుతున్న పదవ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు 552 మంది రాయగ 524 మంది పాసయ్యారని 28 మంది ఫెయిల్ అయ్యారని 94.93% వచ్చిందని ఆయన అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.









