భద్రాచలం త్రివేణి పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల ప్రభంజనం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం: ఏప్రిల్ 29 : టుడే 9 ప్రతినిధి

భద్రాచలం త్రివేణి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కె.దర్శిని 579/600 మార్కులతో భద్రాచలం డివిజన్ టాప్ ప్లేస్ లో నిలిచింది. అదేవిధంగా పి. హర్షిణీప్రియ 574/600, కె.మనోహర్ రెడ్డి 572/600 , జిపిల్.అక్షయ 570/600 మరియు వి. సాయి సిరి 570/600 వంటి టాప్ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. త్రివేణి పాఠశాలలో మొత్తం పదవ తరగతి విద్యార్థులు 82 మందికి గాను 51 మందికి పైగా 500 మార్కులతో విజయ డంకా మోగించారు.ఈ సందర్భంగా త్రివేణి స్కూల్ ప్రిన్సిపాల్ నిరుపమ మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలోని పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో టాప్ ప్లేస్ లో నిలవటానికి సహకరించిన తల్లిదండ్రులకు. బోధనా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇంత అత్యధిక శాతం మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరకి శుభాశీస్సులు అందించారు .త్రివేణి పాఠశాలలో ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో వారి యొక్క సత్తా చాటుతున్నందుకు ,ఈ ఘనవిజయానికి చక్కటి ప్రణాళికను రూపొందిస్తున్న యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో బాబురావు, వైస్ ప్రిన్సిపాల్ విమల, అకాడమిక్ ఇన్చార్జి నరేష్ ,క్యాంపస్ ఇన్చార్జి సురేష్ , సందీప్,తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు