అడ్మిషన్ల వాల్పోస్టర్ ఆవిష్కరణ.
పాల్గొన్న ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం : ఏప్రిల్ 27: టుడే 9 ప్రతినిధి
తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల దమ్మపేట మండలం అంకంపాలెంలో కాకతీయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నట్లు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల అడ్మిషన్లకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన బాలికలు అత్యుత్తమ గ్రేడులతో పాసై వివిధ యూనివర్సిటీలలో సీట్లు సంపాదించి చదువుకుంటున్నారని అన్నారు. ఈ కళాశాలలో బి ఏ (హెచ్ ఈ పి), బి ఎస్ సి (బి జెడ్ సి, ఎంపీసీఎస్), బీకాం (జనరల్), బీకాం (సి ఎ) కోర్సులు కలవని ఆయన అన్నారు. ఈ కళాశాలలో చేరే విద్యార్థినులకు అందించే సౌకర్యాలు, పూర్తి ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత భోజనము వసతిగృహము, స్మార్ట్ బోర్డ్ & విశాలమైన డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, ఎన్ సీ సీ& ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్, పీహెచ్డీ, నీట్, సెట్ అర్హత అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన,ఎంప్లోయబిలిటీ & పీజీ ఎంట్రెన్స్ కు ఫ్రీ కోచింగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు, యూనిఫామ్స్, ట్రాలీ బ్యాగ్, 12 రకాల ఉచిత సౌకర్యాలు, ప్రతి విద్యార్థి ఆరోగ్య విషయాలపై వెల్నెస్ సెంటర్ ద్వారా వ్యక్తిగత శ్రద్ధ, సువిశాల క్రీడా ప్రాంగణం & క్రీడలపై ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.
కావున గిరిజన విద్యార్థినిలు తప్పనిసరిగా ఈ కళాశాలలో అడ్మిషన్లు పొంది పై చదువులు చదవాలని ఆయన అన్నారు. మరిన్ని వివరాలకు 9704274212, 8790586772 ఫోన్ నెంబర్లకు సంప్రదించి తెలుసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్సిఓ అరుణకుమారి, ఎస్ డి సి ఆనందకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి స్పందన, కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంచార్జ్ స్పందన, కామర్స్ ఇంచార్జ్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









