లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఆర్ జిల్లా డీఆర్వో లోకేశ్వరరావు..

పాడేరు: అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం భారీ దాడి నిర్వహించి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ – ఎఫ్‌ఏసీ) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే…

కలెక్టరేట్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అమ్ము సూర్య చక్రవర్తికి సంబంధించిన జీతాల బకాయిలు, పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్లు మరియు పే స్కేల్ రెగ్యులరైజేషన్ బిల్లులు ఆమోదించడానికి డీఆర్ఓ లోకేశ్వరరావు రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయంపై ఏసీబీ విశాఖపట్నం రేంజ్ అధికారులను ఆశ్రయించాడు.


బాధితుడి ఫిర్యాదు మేరకు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన ఏసీబీ బృందం, పాడేరు ఆర్‌డీవో కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 50,000 నగదును లోకేశ్వరరావు స్వీకరిస్తుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆయన చేతులకు రసాయన పరీక్షలు (కెమికల్ టెస్ట్) నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు