MBBS చదువుకు ₹1.20 లక్షల ఆర్థిక సహాయం
భద్రాచలం సెప్టెంబర్ 07 : D వినేష్ డివిజన్ ప్రతినిధి
ములకలపల్లి మండలం, సీతాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్ తల్లిదండ్రులు లేకపోయినా, తన కష్టంతో చదువుకుని NEETలో 424 మార్కులు సాధించి MBBS సీటు సాధించాడు.
ప్రస్తుతం Arundathi Institute of Medical Sciencesలో తనకు కేటాయించిన MBBS సీటును కొనసాగించేందుకు (మంగళవారం)లోపు ₹1,20,000/- ఫీజు చెల్లించాల్సి ఉంది.
ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న భద్రాచలం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్ స్పందించి, నక్క సంతోష్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ITDA ద్వారా ₹60,000/- ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా త్వరితగతిన స్పందించి ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన ITDA PO బి. రాహుల్ కు ఆదివాసీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ITDA ద్వారా అందిన ₹60,000/-కు అదనంగా అవసరమైన మిగిలిన మొత్తాన్ని సమీకరించేందుకు ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు, దాతలు ముందుకు వచ్చారు. ఇదంతాకేవలం ఒక గంట సమయంలోనే ₹60,116/-ను వివిధ దాతల ద్వారా సమీకరించారు .

ఇది ఇలా ఉంటే ముఖ్యంగా, నక్క సంతోష్ MBBS అడ్మిషన్ కోసం అవసరమైన ₹60,000 ను దాతలనుంచి సమీకరించాల్సిన లక్ష్యాన్ని కేవలం ఒక గంటలోనే పూర్తి చేయడం గమనార్హం .
ఒక ఆదివాసీ బిడ్డ డాక్టర్ కావాలనే కలకు అండగా నిలిచిన ITDA PO . రాహుల్ కు , ఆదివాసీ నాయకులకు, ఉద్యోగులకు, దాతలకు మరియు ఆన్లైన్ ద్వారా సహకరించిన ప్రతి ఒక్కరికీ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆదివాసి సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, మిడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.









