డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తప్పుడు వార్తలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చింతిరేల రవికుమార్.
పత్రికలు ఊహా జనిత వార్తలు రాసి నాయకులు, అధికారులను వారి కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేయటం సరికాదని. నాయకులు, అధికారులు తప్పు చేసినా అవినీతికి పాల్పడినా, అధికారాన్ని దుర్వినియోగం చేసినా నిర్భయంగా బయటపెట్టాలని కాగా నిరాధారమైన కథనాలు రాసి ఇబ్బందులు సృష్టించొద్దని హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎఫ్ సి సెల్ చైర్మన్ చింతిరియాల రవికుమార్. వాస్తవదూరమైన, ఆధారాలు లేని ఊహాజనిత వార్తలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీడియా యాజమాన్యాలపై ఉందని అన్నారు.
దళిత నాయకుడు పై తప్పుడు వార్తలు రాస్తే సహించబోమని ,40 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితంపై విమర్శలు చేసినందుకు.బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రవికుమార్.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై ఏబీఎన్ రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి పత్రికలో ‘కొత్త పలుకు’లో అని రాసిన వార్త సత్య దూరంగా ఉందని..గాంధీ కుటుంబం ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన భట్టి విక్రమార్క,గత 40 ఏళ్లుగా సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా తెలంగాణ ఏర్పాటులో భట్టి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మచ్చలేని రాజకీయ చరిత్ర కలిగిన అటువంటి నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.కావాలనే రాష్ట్ర మంత్రివర్గంలో అభిప్రాయ భేదాలు సృష్టించి, ప్రభుత్వంపై అస్థిరత కల్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
సింగరేణి వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత కథలను సృష్టించాలని ప్రయత్నించటం తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనన్నారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీడియాకు అండగా నిలబడిందన్నారు. ఈ రోజు అదే పార్టీకి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. మీ చానల్ కు, ఇతర మీడియా సంస్థలకు ఉన్న వ్యక్తిగత తగాదాలను కాంగ్రెస్ పార్టీకి అంట కట్టడం సరికాదన్నారు. మీ మీడియా వర్గాలలో గొడవలు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలని ,ఎదుటివారి మీద బురద చల్లకూడదని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాతలను కాంగ్రెస్ కార్యకర్తలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా అవాస్తవాలు రాయడం మానుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రమంతటా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు జేబీ శౌరి, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్,చుంచుపల్లి మండల అధ్యక్షుడు పాల్, కొత్తగూడెం పట్టణ కన్వీనర్ ఎండి గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.








