సీఎం నోటి వెంట భద్రాచలం అభివృద్ధి ప్రసక్తి.. ఈ ప్రాంత ప్రజల్లో వెల్లివిరుస్తున్న ఆనందం..

భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి పరుస్తానన్న ముఖ్యమంత్రి హామీతో భద్రాద్రి ప్రాంత ప్రజలలో ఆనందం వెల్లివిరుస్తోంది… ఆదివారం సమ్మక్క సారక్కల సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ హామీతో రామాలయం మాడవీధుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..ఇప్పటికే ఆలయ నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తయిందని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అయోధ్య రామమందిరాన్ని తలపించేలా,మన భద్రాచల రామ మందిరాన్ని నిర్మించుకుందాం.. అని వ్యాఖ్యానించటంతో భద్రాద్రి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం పైగా గడిచిపోయినా, గత  పాలకులు భద్రాచలం విషయంలో దృష్టి సారించకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడిందని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి  ముఖ్యమంత్రులు భద్రాచలాన్ని టెంపుల్ టౌన్ గా మారుస్తామన్న మాటలు సాకారం కాకపోవటం, ముఖ్యంగా ఏజెన్సీ చట్టాలవల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తడం మూలంగా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కన్నా భద్రాచలం అభివృద్ధిలో కొంత వెనకంజలో ఉందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆదివారం చేసిన ప్రకటనతో భద్రాద్రి వాసుల ఆశలు మళ్లీ చిగురించాయని ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అతి త్వరలో భద్రాచలం రామ మందిరాన్ని నిర్మించుకుందాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కార్యరూపం దాల్చాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు