తిరుపతి జిల్లా వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజున మేకను బలిచ్చారనే ఆరోపణలతో,కే.వి.బి.పురం పోలీసులు సర్పంచ్ గిరిని అరెస్ట్ చేశారు.కాగా గిరిపై అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేయగా.. 2/2026 కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో శనివారం ఉదయం గిరిని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రజల ఆందోళనల మధ్య గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి శ్రీకాళహస్తి కోర్టులో ఎస్సై ఓబయ్య హాజరు పరిచగా,రిమాండ్‌ను తిరస్కరించిన శ్రీకాళహస్తి కోర్టు జడ్జి.. స్టేషన్ బెయిల్ పై వైసీపీ నేత గిరిని పోలీసులు విడుదల చేశారు.
Post Views: 24









