యాదాద్రి లక్ష్మినృసింహుడి కి అపచారం!

యాదాద్రి లక్ష్మినృసింహుడి కి అపచారం!

సంప్రదాయాలకు నీళ్లు వదిలి, డాలర్ల కోసం దేవుడిని అంగట్లో సరుకుని చేస్తారా అంటూ భక్తుల మండిపాటు

విదేశాల్లో ఇష్టానుసారంగా దేవుడి విగ్రహాలను తిప్పుతున్న వైనం..

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో  వైరల్‌…

ఎవరైనా ఖరీదైన భక్తులు డబ్బులిస్తే చాలు.. చరమూర్తులను వారికే యాదాద్రి అధికారులు అప్పగించేస్తున్నారంటూ మండిపడుతున్న భక్తులు…

యాదగిరి నరసింహునికి ఘోర అపచారం జరుగుతోంది.కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ఆలయ సిబ్బంది విదేశాలకు విగ్రహాలను పంపుతున్నారని భక్తులు మండిపడుతున్నారు.చర మూర్తులైనా, ఏ విగ్రహాలైనా వాటి పవిత్రతను కాపాడాల్సిన వారే అనాచారంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ భక్తులు  ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కెనడా, లండన్‌లో జరిగిన కల్యాణాల్లో చాలావరకు ఇలాగే వ్యవహరించారంటూ ఆలయంలో చర్చ జరుగుతోంది.స్వామివారి ఉత్సవ మూర్తిని ఏకంగా కారులో సీటు బెల్ట్‌ పెట్టి తీసుకెళ్తున్న ఫొటో, ప్యాంటూ షర్ట్‌ వేసుకుని దేవుడిని పట్టుకున్న ఫొటోలు వైరల్‌ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సంప్రదాయాలకు నీళ్లు వదిలి, డాలర్ల కోసం దేవుడిని అంగట్లో సరుకుని చేస్తారా అంటూ స్థానికులు,భక్తులు ఆవేదన చెందుతున్నారు.ఎవరైనా భక్తులు డబ్బులిస్తే చాలు.. చరమూర్తులను వారికే అప్పగించేస్తారా అని యాదాద్రి అధికారులను ప్రశ్నిస్తున్నారు.స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కారులో తరలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ అధికారుల తీరుపై ప్రజలనుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు