నేడు వనదేవతల చెంతకు రాష్ట్ర మంత్రి వర్గం..

నేడు వనదేవతల చెంతకు రాష్ట్ర మంత్రి వర్గం..

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.

ఖమ్మం పర్యటన అనంతరం హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోనున్న సీఎం.

మంత్రివర్గ సమావేశం అనంతరం మేడారంలోనే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా తీసుకున్న  ప్రత్యేక కేబినెట్ సమావేశం నేడు మేడారంలో జరగనుంది. ఖమ్మం పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు.సమావేశం అనంతరం ఈ రాత్రికి మేడారంలో బసచేయనున్నారు.ఈ క్రమంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

సోమవారం ఉదయం 6.30 గంటలకు మంత్రులతో కలిసి నూతనంగా నిర్మించిన సమ్మక్క – సారలమ్మ గద్దెలను సీఎం ప్రారంభించనున్నారు. వనదేవతలకు చీర, సారె, బెల్లంతో మొక్కులు సమర్పించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నట్లు సమాచారం.కాగా మేడారంలో కేబినెట్ భేటీ కోసం వస్తున్న సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు