తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ తల్లిలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టినందుకు, తెలంగాణ రాజముద్ర మార్చినందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరని అన్నారు.సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీని అడ్డుకున్నారు,ఇదేనా రాహుల్ గాంధీ నువ్వు చెప్పే రాజ్యంగా రక్షణ అంటే? అని ప్రశ్నించారు.ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని,కచ్చితంగా కోర్టులో అనుమతి తెచ్చుకుని, మరోసారి ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. ఇది ఇలా ఉంటే,తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ దృతరాష్ట్రుడిగా మారిపోయారని ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు నాకు ఆధారాలేం కనబడట్లేవు అని మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్.తెలంగాణలో జర్నలిస్టులను ఉగ్రవాదులు, నేరగాళ్ల లాగ అరెస్టులు చేస్తున్నారంటూ, జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ నడిపిస్తారు అనేది తెలంగాణలో కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదని, మాటిమాటికి ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాల్లో అదే నడుస్తుందని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయే ప్రయత్నం చేశారని ,హైదరాబాద్ మహానగరంలో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 సర్కిళ్లు చేసుకున్నాము.. 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాము ఇన్ని చేసినా కూడా హైదరాబాద్ అస్తిత్వాన్ని మేము ఎప్పడు ముట్టుకోలేదని గుర్తు చేశారు. శాంతియుతంగా కొనసాగిస్తున్న ర్యాలీని అడ్డుకున్నంత మాత్రాన ప్రజల కోసం చేస్తున్న తమ పోరాటం ఆగిపోదని కేటీఆర్ స్పష్టం చేశారు.









