సికింద్రాబాద్ బచావో ర్యాలీకి భారీగా తరలి వచ్చిన ప్రజలు.

బీఆర్ఎస్ పిలుపునిచ్చిన సికింద్రాబాద్ బచావో ర్యాలీకి ప్రజలు  భారీగా తరలివస్తున్నారు.సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు సికింద్రాబాద్ ఆత్మ గౌరవ శాంతి ర్యాలీ కొనసాగనుంది.ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా  బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.నల్ల జెండాలు, కండువాలు ధరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు భారీ ఎత్తున ర్యాలీతో నాయకులు, ప్రజలు.తరలివస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు..

సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో స్థానిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతి ర్యాలీకి అనుమతి లేదంటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా?

సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు.ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారని,ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చు అదే రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారు అని అన్నారు.మేము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూను తలిచినట్లు వేలాది మంది పోలీసులను పెట్టి అందరిని అరెస్టులు చేస్తున్నారు అంటూ  మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్రోశం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు