మేడారంలో మంత్రుల కేబినెట్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క…
ఈ నెల 18 న మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశానికి కావలసిన ఏర్పాట్లను,వసతి సముదాయాలను మంత్రి సీతక్క పరిశీలించారు. కాగా 18వ తేదీన ఖమ్మం పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు.మేడారం చేరుకున్నాక పునర్నించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశంలో , రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు.
మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వర్గం, అధికారులు అంతా రెండు రోజులు మేడారంలో బస చేయాల్సి ఉండగా, 300 మందికి అధికారుల వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.మంత్రులు, అధికారుల వసతి కోసం ములుగు, గోవిందరావుపేట, పస్రా, లక్నవరం, రామప్ప ప్రాంతాల్లోని వసతి గృహాలు, ప్రైవేటు హోటళ్లను ముందుగానే అధికారులు బుక్ చేదారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రి వర్గం రెండు రోజులు మేడారంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, 1500 మంది పోలీసులతో,పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయనుంది.







