ఈ నెల 18న మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం.. తొలిసారి సచివాలయం బయట జరగనున్న కేబినెట్ భేటీ…
సమ్మక్క-సారలక్క మేడారం జాతర మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. తెలంగాణ చరిత్రలో తొలి సారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 18న ములుగు జిల్లా మేడారంలో జరగనుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో మంత్రివర్గం, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి తరలిరానున్నారు.
ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.అంతేకాకుండా రైతు భరోసాపై కూడా స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.









