కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీరామచంద్రుడు లాంటి వాడు… జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి…
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామ చంద్రుని లాంటి వాడని,అలాంటి మచ్చలేని నాయకుడి పై ఆరోపణలు రావటం బాధాకరమని అభిప్రాయపడ్డారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి…దేవుడి లాంటి కోమటిరెడ్డిపై వీడియోలు చేయడం బాధాకరం అని అన్నారు. కోమటిరెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారంతో నేను మూడు రోజులుగా తిండి కూడా తినలేకపోతున్నానన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఆరోపణలు రావటం తనను కలచివేసిందన్నారు.కాగా తాను ఈ విషయాలను టీవీలో చూసినప్పటినుంచి నిద్రాహారాలు మానేసి బాధపడుతున్నానన్నారు. ఏది ఏమైనప్పటికీ ,ఈ విషయంలో విచారణ జరుగుతోంది కాబట్టి త్వరలోనే అన్ని విషయాలు బయటికొస్తాయన్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
Post Views: 34









