ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ…నేపద్యంలో ఇదే చివరి అవకాశం అంటూ ఘాటు వ్యాఖ్యలు..
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? మేమే నిర్ణయం తీసుకోవాలా? అంటూ ప్రశ్నించింది.రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసును కోర్డు రెండు వారాలు వాయిదా వేసింది.
రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశం..
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేస్తూ, ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇది చివరి అవకాశం. కేసు రెండు వారాలు వాయిదా.. లేదంటే సుప్రీం ధర్మసనం నిర్ణయం తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు లో ఎమ్మెల్యేల పిరాయింపుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ,స్పీకర్ కు చివరి అవకాశం ఇస్తున్నాం. రెండు వారాల్లో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల పై నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆదేశించింది.
స్పీకర్ తరపున అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై నిర్ణయం స్పీకర్ ప్రకటించారని కోర్టుకు తెలియజేశారు. అంతే కాకుండా స్పీకర్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. సెక్రటరీ జనరల్ మారారు. మరికొంత సమయం ఇవ్వాలని స్పీకర్ తరపు న్యాయవాది సింఘ్వీ కోరారు..









