వారిపై వేటు వేయలేం…. ఆధారాలు లేవు… స్పీకర్

పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య ,పోచారం శ్రీనివాస్ రెడ్డి లపై పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని,అందువల్ల ఎటువంటి వేటు వేసే అవకాశం లేదని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ .కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర తీర్పుఇచ్చారు .పార్టీ ఫిరాయించిన కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయడానికి నిరాకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇద్దరూ తాము గెలిచిన బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని,వారు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి తీర్పును ప్రకటించామో,అదే తీర్పు వీరికి కూడా వర్తిస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు