పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై నేడు తీర్పు ఇవ్వనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్…
ఒక పార్టీ నుంచి గెలిచిన అనంతరం మరో పార్టీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ఉదంతం అందరికీ తెలిసిందే, కాగా ఆ ప్రహసనం కోర్టు మెట్లకు ఎక్కడం ,న్యాయస్థానం ఆ విషయాన్ని స్పీకర్ తీర్పుకు వదిలేయటం కూడా తెలిసిందే .ఈ క్రమంలో గత నెలలో పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరించి,అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు.అయితే తాజాగా వారితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, చింతా ప్రభాకర్ లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టారు,ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తయిన క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2:30కి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పును వెలువరించనున్నారు.









